Sunday, March 1, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంBeat Boxer | బండారి దీక్షిత్ సంచలనం

Beat Boxer | బండారి దీక్షిత్ సంచలనం

బీట్ బాక్సర్‌గా విశేష ప్రతిభ
తెలంగాణ యువ కళాకారుడి ప్రస్థానం
లూప్ ఆర్టిస్ట్, కంపోజర్, టీవీ పెర్ఫార్మర్‌గా బహుముఖ ప్రజ్ఞ
వినోద రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం
నోటితోనే అద్భుతమైన సంగీత సృష్టి
సామాజిక మాధ్యమాల్లోనూ బ్రహ్మాండమైన ఫాలోయింగ్

తెలంగాణ యువ కళాకారుడు (Young Artist From Telangana) బండారి దీక్షిత్.. బీట్ బాక్సర్‌(Beat Boxer)గా సంచలనాలు సృష్టిస్తున్నాడు. తెలుగు సంగీత ప్రపంచంలో తనదైన శైలితో దూసుకుపోతున్నాడు. బీట్‌బాక్సర్‌గానే కాకుండా లూప్‌ ఆర్టిస్ట్‌(Loop Artist)‌గా, డీజే బీట్‌బాక్స్‌ ప్రదర్శకుడిగా, కంపోజర్‌(Composer)‌గా, టీవీ పెర్ఫార్మర్‌(TV Performer)గా వినోద రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నెలబెట్టుకున్నాడు. అనితర సాధ్యమైన దీక్షిత్ ప్రయాణం అతని స్వరంలాగే వైవిధ్యంగా సాగుతోంది. అతని అభిరుచిలాగే సరికొత్త శిఖరాలకు చేరుకుంటోంది.

- Advertisement -

బండారి దీక్షిత్ స్టేజ్ పేరు.. దీక్షిత్ డీబీఎక్స్(Dikshit DBX). హైదరాబాద్‌ హార్ట్ నుంచి వచ్చిన ఇతను.. సంగీతానికి సంప్రదాయ వాద్యాలు అవసరం లేదని నిరూపించాడు. బీట్‌బాక్సింగ్‌పై ఆసక్తి కలిగిన మరుక్షణమే బండారి దీక్షిత్ ఈ విషయాన్ని గ్రహించాడు. వెంటనే ఆచరణలో పెట్టాడు. నోటితోనే అద్భుతమైన సంగీతం సృష్టించగలమని తన మ్యాజిక్‌లాంటి మ్యూజిక్‌తో చాటిచెప్పాడు. తద్వారా ఈ కళకు అంకితమైపోయాడు. శబ్ధాలపై శ్రద్ధపెట్టి కొన్నాళ్లకే ప్రయోగాలు కూడా చేసే స్థాయికి చేరాడు.

రోజులు గడుస్తున్నకొద్దీ క్లిష్టమైన బీట్‌ ప్యాటర్న్స్‌ నేర్చుకున్నాడు. లూప్‌ స్టేషన్లతో ఎక్స్‌పర్‌మెంట్లు చేస్తూ స్టేజ్‌ పెర్ఫార్మెన్స్‌కు పదును పెట్టాడు. ఈ క్రమంలో తననుతాను డైలీ అప్‌డేట్ చేసుకున్నాడు. బండారి దీక్షిత్‌లోని బహుముఖ ప్రతిభ అతనికి ప్రత్యేకతను సంపాదించి పెట్టింది. ఇతను బీట్‌బాక్స్‌ను లూపింగ్‌ను కలిపేయగలడు. ఒకే బీట్‌లను కాదు.. తన స్వరాన్ని లేయర్లుగా వేసి రియల్‌టైమ్‌లో లూప్‌లు రూపొందించి పూర్తి మ్యూజిక్ స్కేప్‌ని క్రియేట్ చేస్తాడు.

బండారి దీక్షిత్ కేవలం స్టేజ్ ప్రదర్శనకే పరిమితం కాలేదు. సొంత సంగీతాన్నీ రిలీజ్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. డీజే డెక్స్ లేకుండానే ఆ ఫీలింగ్ కలిగిస్తున్నాడు. అతని నోరే డీజే సెట్‌లా పనిచేస్తుండటం విశేషం. పర్కషన్‌, మెలోడీ, బాస్‌.. ఇలా.. అన్నీ లైవ్‌గా సృష్టిస్తాడు. మనిషి స్వరం అత్యంత శక్తివంతమైన వాద్యమని బండారి దీక్షిత్ నమ్మకం. అందుకే బీట్‌బాక్స్‌ను మెలోడీలతో, లైవ్ లూపింగ్‌తో కలిపి ప్రతి ప్రదర్శననూ కొత్తగా, ఊహించనివిధంగా మలుస్తున్నాడు.

2018లో తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించిన బండారి దీక్షిత్.. 2019 నుంచి ఈటీవీ కార్యక్రమాల ద్వారా బీట్‌బాక్సర్‌గా గుర్తింపు పొందాడు. పటాస్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ14, గణేశ్ స్పెషల్ వంటి ప్రముఖ షోల్లో తన ప్రదర్శనలతో మంచి పేరు సంపాదించాడు. వీ6, ఈటీవీ తెలంగాణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వంటి ఛానళ్లలో ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయి. ఇప్పటివరకు 500లకు పైగా లైవ్ షోలు నిర్వహించి తన అసమాన ప్రతిభను నిరూపించుకున్నాడు. 2021లో కీబోర్డ్, సంగీతం నేర్చుకోవడం ప్రారంభించాడు.

బండారి దీక్షిత్.. తన హిప్‌హాప్ శైలితో కొత్త రకం సంగీతాన్ని సృష్టిస్తున్నాడు. నోటితోనే ఫుల్ మ్యూజిక్‌ను నిర్మించే అరుదైన ప్రతిభ ఇతని సొంతం. ప్రత్యక్ష ప్రదర్శనల్లో బండారి దీక్షిత్ చూపిస్తున్న నియంత్రణ, వేగం, సృజనాత్మకత అతణ్ని తెలుగు బీట్‌బాక్సింగ్‌లో ప్రముఖ యువ కళాకారుడిగా నిలబెడుతున్నాయి. సంగీతంపై పెరుగుతున్న ఇతని ప్రభావం, నిరంతరం వస్తున్న కొత్త ప్రాజెక్టులు చూస్తుంటే దీక్షిత్ డీబీఎక్స్ భవిష్యత్తులో తెలుగు సంగీత రంగానికి మరిన్ని విశేషాలను అందిస్తాడనటంలో ఎలాంటి సందేహంలేదు.

బీటెక్ చదువుతున్నప్పుడే బండారి దీక్షిత్ తన మొదటి కంపోజిషన్లను రూపొందించాడు. అదే సమయంలో విడుదలైన ఓల్డ్ స్కూల్ బీట్‌బాక్స్ 2020 ట్రాక్‌ను ఎడెక్స్‌లైవ్ ప్రత్యేకంగా ప్రశంసించింది. దీక్షిత్ డీబీఎక్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ ప్రారంభించి.. అందులో.. బీట్‌బాక్స్ పెర్ఫార్మెన్స్ వీడియోలు, ట్యుటోరియల్స్‌ను నిరంతరం అప్‌లోడ్ చేస్తున్నాడు. తద్వారా ఆన్‌లైన్ గుర్తింపును రోజురోజుకూ పెంచుకున్నాడు.

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో బండారి దీక్షిత్ పెర్ఫార్మెన్స్ క్లిప్స్, బీట్‌బాక్స్ వీడియోలు విస్తృతంగా పాపులర్ అవుతున్నాయి. ఈ వీడియోలు అతని ప్రాచుర్యాన్ని మరింతగా పెంచాయి. బండారి దీక్షిత్ ఇంటర్వ్యూలు కూడా సోషల్ మీడియాలో మంచి చర్చకు దారితీశాయి. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన హీరోస్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో ఇతని లైవ్ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకపై వచ్చిన వార్తల్లో దీక్షిత్ పెర్ఫార్మెన్స్‌ను స్పష్టంగా ప్రస్తావించటం గమనార్హం.

లైవ్ షోలు, కార్పొరేట్ ఈవెంట్స్‌లో అత్యధికంగా కోరుకునే ఆర్టిస్ట్‌గా బండారి దీక్షిత్ నిలిచాడని షోగాగా పేర్కొంది. ఇతను ఈ ఏడాది విడుదల చేసిన సింగిల్ ఓల్డ్ స్కూల్ బీట్‌బాక్స్ క్లాసిక్ బీట్‌బాక్సింగ్ వైబ్స్‌తో ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఆలోచనాత్మకంగా బీట్‌బాక్స్‌ను ఆట్మాస్ఫెరిక్ లూప్స్‌తో కలిపిన ది డీప్ అనే ట్రాక్‌ అలరిస్తోంది. స్పోటిఫైలో నిజం.. ద ట్రూత్, దట్ ఫ్లో, ద ట్యూన్ వంటి సింగిల్స్ లభిస్తున్నాయి. ఇవి బండారి దీక్షిత్ ఫుల్‌ఫ్లెడ్జ్‌డ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా మారుతున్న తీరును వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News