గత ఐదేళ్లలో 62 మంది భారతీయ విద్యార్థులు అమెరికా(America)లోకి ప్రవేశించకుండా ఆ దేశం అడ్డుకుంది(Denied Entry). ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం (Govt Data) పార్లమెంట్‌లో తెలిపింది. యూఎస్‌తోపాటు ఇతర దేశాల ఇమిగ్రేషన్ అధికారులు వ్యవహరించిన ఈ అభ్యంతరకమైన తీరును విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (Minister of State for External Affairs) కీర్తివర్ధన్ సింగ్(Kirti Vardhan Singh) రాజ్యసభకు రాతపూర్వంగా చెప్పారు.
ఇండియన్ స్టూడెంట్స్‌కి ఎంట్రీ ఇవ్వకపోవటానికి ఆయా దేశాలు పలు కారణాలను చూపాయని పేర్కొన్నారు. సరైన పత్రాలు లేకపోవటం, యూనివర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియలను తగు విధంగా పూర్తిచేయకపోవటం, స్టడీకి సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పకపోవటంతో ప్రవేశాన్ని నిలిపివేశాయని వెల్లడించారు. 2025 జనవరి 1 నాటికి మన విద్యార్థులు 18,82,318 మంది 153 దేశాల్లో చదువుతున్నారని వివరించారు.
అయితే.. ఇందులో 11 దేశాలు అడ్డుకున్న విద్యార్థుల సంఖ్యను మంత్రి తన సమాధానంలో పొందుపరిచారు. దీని ప్రకారం.. కిర్గిజ్‌స్థాన్ 11 మందికి పర్మిషన్ ఇవ్వలేదు. యూకే 170, ఆస్ట్రేలియా 114, రష్యా 82, యూఎస్ 45, ఉక్రెయిన్ 13, ఫిన్‌లాండ్ ఐదుగురిని డిపోర్ట్ (Deport) చేసింది.
