- మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకు వేయండి
- మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటా
- సర్పంచ్ అభ్యర్థి పనుగట్ల శ్రీనివాస్ గౌడ్
గ్రామ ప్రజలే నా తోబుట్టువులని మీతోనే నా జీవిత ప్రయాణం అని. నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటానని మీకు సేవ చేయడంలో ఎల్లవేళలా ముందుంటానని జగదేవపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ పై నమ్మకంతో జగదేవపూర్ గ్రామ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మీకు సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్నానని మండలంలోని ప్రజలంతా తమ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. ఒక గ్రామ సర్పంచిగా కాకుండా గ్రామానికి ఓ ..సేవకుడిలా పనిచేస్తానని గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్న వాటిని పరిష్కారం అయ్యేవరకు కృషి చేస్తానని తెలిపారు . కావున జరగబోయే ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కోరారు.
