ఇండియా.. 24 సీహాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేయనుంది. అమెరికా సంస్థ (America Company) లాక్‌హీడ్ మార్టిన్ (Lockheed Martin) నుంచి పర్ఛేజ్ చేయనున్న వీటి విలువ 946 మిలియన్ డాలర్లు. ఈ మేరకు రక్షణ శాఖ (Defence Ministry) ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.. ఇండియా(India), అమెరికా రక్షణ భాగస్వామ్యంలో కీలకమైన ముందడుగు పడింది. ఇది ఇండియాకి గ్రేట్ న్యూస్ (Great News) అని చెప్పొచ్చు. 24 ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్ల కొనుగోలు కోసం అమెరికా కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్‌తో సంతకాలు జరిగాయి. 946 మిలియన్ డాలర్ల విలువైన ఈ డీల్ వల్ల భారత నావికా దళం సామర్థ్యాలు మెరుగుపడతాయి.
అమెరికాతోపాటు ఇతర ప్రాంతీయ భాగస్వాములతో బంధం బలోపేతమవుతుంది. తద్వారా ఈ రెండు దేశాలు సురక్షితంగా, మరింత సంపన్నంగా తయారవుతాయి. ఈ విషయాన్ని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ (US State Department) ఎక్స్ వేదికగా వెల్లడించింది. 2020లో మన దేశం విదేశీ సైనిక అమ్మకాల ఒప్పందం కింద ఈ హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. ఈ విధంగా ఇప్పటికి దాదాపు 15 విమానాలను సేకరించింది. MH-60R సీహాక్ అనేది విభిన్న పాత్రలు పోషించే సముద్ర హెలికాప్టర్. ఇది జలాంతర్గామి యుద్ధాలు చేయగలదు. ఉపరితల మిషన్లు, శోధన, రెస్క్యూ, నిఘా, ఓడ ఆధారిత కార్యకలాపాలను నిర్వహించగలదు.
