- రాజ్యసభకు తెలిపిన నడ్డా
దేశంలో వైద్యులు-జనాభానిష్పత్తి 1:811 అని కేంద్రం పార్లమెంటుకు మంగళవారం తెలిపింది. సభ్యలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యమంత్రి రాజ్యసభలో సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అల్లోపతి మరియు ఆయుష్ (ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం,యునాని, సిద్ధ మరియు హోమియోపతి)ల్లో 80శాతం నమోదిత వైద్యులు అందుబాటులో ఉన్నారని ఊహిస్తే, దేశంలో వైద్యులుజనాభా నిష్పత్తి 1:811గా అంచనా వేయబడిరదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో 13,88,185 మంది నమోదిత అల్లోపతి వైద్యులు ఉన్నారని, ఆయుష్ వైద్య విధానంలో 7,51,768మంది రిజిస్టర్డ్ ప్రాక్టిషనర్లు ఉన్నారని కేంద్ర ఆరోగ్యమంత్రి జె.పి.నడ్డా తెలిపారు.దేశంలో మెడికల్ కాలేజీలు, అండర్ గ్రాడ్యుయేట్ (యుజి), పిజి వైద్య సీట్లు గణనీయంగా పెరిగాయని అన్నారు. 2014 నుండి మెడికల్ కాలేజీల సంఖ్య 387 నుండి 818కి, యుజి సీట్లు 51,348 నుండి 1,28,875కి, పిజిసీట్లు 31,185 నుండి 82,059కి పెరిగాయని అన్నారు.
