పార్కింగ్ ఫీజు విషయంలో తేడాలు
బోర్డు మీద ఒకటి.. టిక్కెట్‌పై మరొకటి
కోర్టుకు వెళితే జేబులు గుల్లే
ఎక్కడైనా అన్యాయం జరిగితే న్యాయం చేయండి మహాప్రభో అంటూ కోర్డు మెట్లెక్కుతారు. మరి అదే న్యాయ స్థానంలో మోసం(Fraud) జరిగితే.. ఎవరిని ఆశ్రయించాలి?. ఇది.. రంగారెడ్డి జిల్లా న్యాయస్థానాల సముదాయం(Rangareddy District Court Complex)లో జరుగుతోంది. కోర్టు పని మీద వస్తున్నవారి వాహనాల పార్కింగ్(Parking)కి అక్కడ ఓ రేటు పెట్టారు. కానీ.. బోర్డు మీద పెట్టిన రేటు ఒకటి.. వసూలు చేసేది మరొకటి.
ద్విచక్ర వాహనాలకు రూ.10, నాలుగు చక్రాల వాహనాలకు రూ.20 వసూలు చేయాలని నిర్ణయించగా.. నిర్వాహకులు ద్విచక్ర వాహనానికి రూ.20, నాలుగు చక్రాల వాహనాలకు రూ.50 వసూలు చేస్తూ అడ్డంగా దోపిడీ (Looty) చేస్తున్నారు. వారు చెప్పినంత డబ్బు చెల్లించకపోతే వాహనం బయటికి పోకుండా గేట్ వద్ద నలుగురు కాపలా ఉన్నారు. కోర్టు బయట పార్కింగ్ చేస్తే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫొటో తీసి ఫైన్ వేస్తాడు. ఈ పరిస్థితుల్లో వాహనాదారులు తప్పనిసరిగా కోర్టు కాంపౌండ్ లోపలే పార్కింగ్ చేయాల్సి వస్తోంది.
