Wednesday, March 4, 2026
HomeసినిమాFirst Single | ‘తిమ్మరాజుపల్లి టీవీ’ నుంచి ఈ నెల 29న

First Single | ‘తిమ్మరాజుపల్లి టీవీ’ నుంచి ఈ నెల 29న

బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటులు, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడుతూ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram).. సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”(Timmarajupalli TV). తేజ వేల్పుచర్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయితేజ్, వేద జలంధర్ హీరోహీరోయిన్‌గా, వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌(Village Backdrop)లో సాగే పీరియాడిక్ డ్రామా(Periodic Drama)గా రూపొందుతున్న ఈ మూవీ త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా.. ఈ ఫిల్మ్ మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ చేశారు. ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన ఈ సినిమా కోసం ఛాట్ బస్టర్ సాంగ్స్ చేశారు. తమ పిక్చర్ నుంచి ఫస్ట్ సాంగ్ వస్తుందంటూ కిరణ్ అబ్బవరం అనౌన్స్ చేసిన వీడియో ప్రోమో ఆకట్టుకుంటోంది.

- Advertisement -

నటీనటులు.. సాయితేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్ తదితరులు. టెక్నికల్ టీమ్: ఆర్ట్ డైరెక్టర్.. సుధీర్ మాచర్ల, బిజినెస్ హెడ్ అండ్ మార్కెటింగ్.. చౌహాన్, క్రియేటివ్ ప్రొడ్యూజర్.. రితికేష్ గోరక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.. కేఎల్ మదన్, డీవోపీ.. అక్షయ్ రామ్ పొదిశెట్టి, మ్యూజిక్.. వంశీకాంత్ రేఖన, సీఈవో.. రహస్య కిరణ్, పీఆర్ఓ.. జీఎస్కే మీడియా(సురేష్-శ్రీనివాస్), కోప్రొడ్యూజర్.. తేజ వేల్పుచర్ల, ప్రొడ్యూసర్.. కిరణ్ అబ్బవరం, రచన, ఎడిటింగ్, దర్శకత్వం.. వి. మునిరాజు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News