Wednesday, March 4, 2026
Homeకరీంనగర్Awareness | సీజనల్ వ్యాధులపై అవగాహన

Awareness | సీజనల్ వ్యాధులపై అవగాహన

కరీంనగర్: బోయిన్ పల్లి మండల మోడల్ స్కూల్లో గురువారం బోయినప ల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి కార్తీక్ ఆధ్వర్యంలో పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. తర్వాత చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, రక్తహీనత, నోటి, వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. అలాగే బాలికల వసతి గృహాన్ని సందర్శించి పిల్లలకు వేడివేడి ఆహారాన్ని అందించాలని, ఆహార పదార్థాలపై ఈగలు దోమలు వాలకుండా చూసుకోవాలని, వార్డెన్ కు పలు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ హేమలత, హెల్త్ అసిస్టెంట్ బిల్లా అశోక్, ప్రిన్సిపల్ రఘునాథ్, ఏఎన్ఎం తిరుమల, ఆశ కార్యకర్త లత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News