Monday, February 23, 2026
Homeమెదక్‌Accident | ట్రాక్టర్,ఆటో ఢీ

Accident | ట్రాక్టర్,ఆటో ఢీ

  • ఒకరు మృతి, పలువురికి గాయాలు

ట్రాక్టర్ మరియు ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన మండల పరిధి నాగ్సాన్ పల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు… పొడ్చన్ పల్లి గ్రామానికి చెందిన పచ్చ దేవరాజ్(17) వృత్తి రీత్యా విద్యార్థి..ఇతను గ్రామానికి చెందిన మరికొందరితో కలిసి అపుడపుడు క్యాటరింగ్ కు వెళ్తున్నాడు. యధావిధిగా మంగళవారం ఉదయం గ్రామానికి చెందిన కొందరితో కలిసి ఆటోలో ఏడుపాయలకు వెళ్లాడు.

అక్కడ క్యాటరింగ్ ముగించుకొని తిరిగి ఇంటికి ఆటోలో వస్తుండగా నాగ్సాన్ పల్లి గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఆటోను ఢీ కొట్టింది.దీంతో ఆటో బోల్తా పడగా ఆటోలో ఉన్న దేవరాజ్ తో పాటు ఆటోలో ఉన్న మరికొందరికి గాయాలయ్యాయి.స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం వారిని అంబులెన్సులో మెదక్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.దేవరాజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా అర్థరాత్రి సమయంలో మార్గమధ్యలో మృతి చెందాడు.మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News