- సరైన ఆలనా పాలన చేయకుంటే ఆర్డీవోకు ఫిర్యాదు చేయాలి.
- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
వృద్ధ తల్లిదండ్రులకు తమ పిల్లలు పోషణ, సరైన ఆలనా పాలన చేయకుంటే ఆర్డీవోకు ఫిర్యాదు చేయాలని సీనియర్ సిటిజన్స్ కు కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని బుధవారం ఐడిఓసి సమావేశ మందిరంలో వారోత్సవ ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడైనా వృద్ధ తల్లిదండ్రులను తమ పిల్లలు సరైన ఆలనా పాలన నిర్వహించిన పక్షంలో వెంటనే ఆర్డీవో కు, లేదా టోల్ ఫ్రీ నెంబర్14567 కు ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వయవృద్ధుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని గుర్తిస్తూ రాజ్యాంగంలో ఒక ఆర్టికల్లో పేర్కొనడం జరిగిందన్నారు.

ఇందులో భాగంగా ప్రభుత్వము సీనియర్ సిటిజన్ యాక్ట్ తీసుకురావడం జరిగిందని, ఎవరైనా తమ తల్లిదండ్రులను పట్టించుకోకుంటే ఆర్డీఓ కు ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఒకవేళ ఆర్డీఓ ఇచ్చిన తీర్పు నచ్చకుంటే కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. వనపర్తి జిల్లాలో ఆర్డీఓ ద్వారా 53 ఫిర్యాదులను పరిష్కరించి వృద్ధ తల్లిదండ్రులకు తమ పిల్లల నుండి ప్రతినెల పరిహారం ఇచ్చే విధంగా తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్డీఓ ఇచ్చిన తీర్పు నచ్చలేదని 5 వేలు నెలకు చాలా ఎక్కువ మేము వేయి రూపాయలు మాత్రమే ఇస్తాము అని కొంతమంది కుమారులు కలెక్టర్ కు అప్పీల్ చేసుకున్నట్లు తెలిపారు.
అయితే ఆర్డీఓ 5 వేలు ఇవ్వమని తీర్పు ఇస్తే తాను నెలకు 10 వేలు ఇవ్వాల్సింది గా ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. జిల్లాలో దాదాపు 23 వేల మందికి ప్రభుత్వం ద్వారా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని, ఈ నెలలోనే 95 మందికి కొత్తగా పెన్షన్ మంజూరు చేసినట్లు తెలిపారు. వయో వృద్ధుల పెన్షన్ భార్యకు లేదా భర్తకు ఒకరికే ఇస్తారని ఒకవేళ పెన్షన్ పొందుతున్న దంపతుల్లో భార్య కానీ భర్త కానీ చనిపోతే వెంటనే దరఖాస్తు చేసుకొంటే మిగిలిన వారికి పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం సీనియర్ సిటిజన్ కమిటీ సభ్యులను శాలువా, మెమెంటో లతో సన్మానం చేశారు. ఆటల పోటీల్లో విజేతలు అయిన వయో వృద్ధులకు ట్రోఫీలను అందజేసి సన్మానం చేశారు. అదనకు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, డీఎస్పీ బాలాజీ, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మమ్మ, సీనియర్ సిటిజన్ కమిటి సభ్యులు శంకర్ గౌడ్, నర్సింహులు గౌడ్, హమీద్, శంశోద్దిన్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు చిన్నమ్మ థామస్, ఖమర్ రెహమాన్, వయో వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.
