Wednesday, February 11, 2026
HomeరాజకీయంJubileeHills | జూబ్లీహిల్స్‌.. కాంగ్రెస్‌దే..

JubileeHills | జూబ్లీహిల్స్‌.. కాంగ్రెస్‌దే..

పాతిక వేలకు పైగా మెజారిటీతో నవీన్ యాదవ్ విజయం

ఉత్కంఠభరితంగా సాగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్ (Naveen Yadav) 25 వేలకు పైగా ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ పార్టీ (Brs Party) అభ్యర్థి మాగంటి సునీత(Maganti Suneetha)ను ఓడించారు. నియోజకవర్గ చరిత్రలో అత్యధిక ఆధిక్యత ప్రదర్శించారు. ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ పార్టీదే పై‘చేయి’ అయింది. బీజేపీ(BJP)కి డిపాజిట్ (Deposit) కూడా దక్కలేదు. బీజేపీతోపాటు బీఆర్ఎస్‌కి గత అసెంబ్లీ (2023) ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లు కూడా ఇప్పుడు రాలేదు.

- Advertisement -

బీసీ రిజర్వేషన్ల ఉద్యమం(BC Reservations Movement), మైనార్టీల మద్దతు హస్తం పార్టీకి సంపూర్ణంగా కలిసొచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన రిక్వెస్ట్‌ను జూబ్లీహిల్స్ ఓటర్లు మన్నించారు. దీనికితోడు అధికార పార్టీ విజయం కోసం బాగా కష్టపడింది. డివిజన్లవారీగా నేతలకు బాధ్యతలు అప్పగించి పక్కాగా ముందుకెళ్లింది. కుటుంబ వివాదం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కాస్త మైనస్ అయిందని చెప్పొచ్చు. రూలింగ్‌లో పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే డెవలప్‌మెంట్‌కి మరింత అవకాశం ఉంటుందని జూబ్లీహిల్స్ ఓటర్లు భావించినట్లు అర్థమవుతోంది. దీంతో.. సెంటిమెంట్ కన్నా అభివృద్ధి కోసమే నవీన్ యాదవ్‌కి పట్టం కట్టినట్లు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News