Homeనల్లగొండKomatireddy | ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

Komatireddy | ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

నల్గొండ జిల్లా చర్లపల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) పరిశీలించారు. తుఫాన్ (Cyclone) వల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ ఇప్పుడు రోజుకు 10 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు జరుగుతోందని తెలిపారు. కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు తొందరపడి ప్రైవేట్ (Private) వ్యాపారులకు అమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర(Support Price)తోపాటు బోనస్ (Bonus) కూడా పొందాలని విజ్ఞప్తి చేశారు.

581031026 1379731800178041 6875928133237190959 n

అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం (Meeting)

- Advertisement -

నల్లగొండలో అధికారులు, రైస్ మిల్లర్ల(Rice Millers)తో సమావేశం నిర్వహించారు. రాత్రి, పగలు పనిచేసి ధాన్యం సేకరణను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులు (Farmers) తుఫాన్, వర్షాల కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడం అత్యవసరమని చెప్పారు. రైతులు తేమ, తరుగు, తాలు పేర్లతో ఇబ్బంది పడకుండా చూడాలని మిల్లర్లను హెచ్చరించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, ప్యాడి క్లీనర్లు, తేమ యంత్రాలు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు చెప్పారు. పత్తి కొనుగోలు నిబంధనల సడలింపుపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపామని వెల్లడించారు. బాయిల్డ్ రైస్ కోటా, బకాయిల వంటి అంశాలపై సీఎం రేవంత్, ఎఫ్‌సీఐ అధికారులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రైతుల ధాన్యానికి పూర్తి మద్దతు ధరతోపాటు బోనస్ కూడా అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News