Saturday, March 7, 2026
Homeఆరోగ్యంCM Chandrababu | అనారోగ్యమే అసలైన పేదరికం

CM Chandrababu | అనారోగ్యమే అసలైన పేదరికం

హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ.. మా నినాదం
పెదకాకాని శంకర ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రం ప్రారంభం

గుంటూరు జిల్లా, నవంబర్ 9: అనారోగ్యమే (Illness) నిజమైన పేదరికమని (Poverty), అందుకే ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. గుంటూరు జిల్లా (Guntur District) పెదకాకానిలో శంకర కంటి ఆస్పత్రి(Shankara Eye Hospital)లో సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. 5 దశాబ్ధాలుగా శంకర ఆస్పత్రి పేదలకు ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందని అన్నారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో నడుస్తున్న శంకర కంటి ఆస్పత్రిలో నూతన భవన నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నిస్వార్థంగా సేవలు చేసే ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News