కరీంనగర్, నవంబర్ 9 (ఆదాబ్ హైదరాబాద్): విద్యుదాఘాతంతో ఆవు మృతి చెందిన ఘటన బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ముత్యపు పరశురాం అనే రైతు (Farmer) పొలం(Field)లో ఇనప స్తంభానికి (Current Pole) దగ్గరగా వెళ్లిన ఆవు.. షాక్‌తో అక్కడికక్కడే కుప్పకూలింది. ప్రమాదవశాత్తూ ఆవును కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని (Financial Help) స్థానికులు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరక్కుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.
- Advertisement -
