Tuesday, February 10, 2026
Homeహైదరాబాద్‌Anganwadi | హ్యాపీ బర్త్‌డే రేవంత్ మామా

Anganwadi | హ్యాపీ బర్త్‌డే రేవంత్ మామా

అంగన్‌వాడిలో సీఎం పుట్టినరోజు వేడుకలు

ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చిన్నారులు
మంత్రి అజారుద్దీన్, కంజర్ల విజయలక్ష్మి యాదవ్ హాజరు

- Advertisement -

హైదరాబాద్ సనత్‌నగర్‌ డివిజన్‌లోని శ్యామలకుంటలోని అంగన్‌వాడి సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు (CM Revanth Reddy Birth Day Celebrations) వినూత్నంగా జరిగాయి. ‘చిన్నారులు హ్యాపీ బర్త్ డే రేవంత్ మామా’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సెలబ్రేషన్స్‌లో మంత్రి అజారుద్దీన్(azharuddin), కాంగ్రెస్ నేత (Congress Leader) కంజర్ల విజయలక్ష్మి యాదవ్ (Kanjarla Vijayalakshmi Yadav) పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిత్యం ప్రజాసేవలో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజల ఆశీర్వాదాలతో గడపాలని విజయలక్ష్మి అన్నారు.

కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్‌వాడి సెంటర్‌ను మోడ్రన్‌(Modern)గా తీర్చిదిద్దారు. ఫ్లెక్సీలు, బొకేలు, హంగు ఆర్భాటాలతో కాకుండా బస్తీలో శిథిలావస్థలో ఉన్న అంగన్వాడిని కొత్తగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా చిన్నారులకు బొమ్మలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సనత్‌నగర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కోట నీలిమతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News