ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన వందేమాతరం 150వ స్మారకోత్సవం(Commemoration)లో ప్రధాని మోదీ (PM Modi) పాల్గొన్నారు. 1985 నవంబర్ 7న భంకించంద్ర ఛటర్జీ (Bhankinchandra Chatterjee) రాసిన ఈ గేయానికి నేటి(2025 నవంబర్ 7)తో 150 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో సంవత్సరం పొడవునా (Year Long) ప్రత్యేక కార్యక్రమాల(Special programs)ను నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా ఇప్పటికే వందేమాతరం స్మారక స్టాంపు(Commemorative Stamp), నాణెం(Coin) విడుదల చేసినట్లు ప్రధాని మోదీ చెప్పారు. వందేమాతరానికి మూలభావం భారత్, మా భారతి అని పేర్కొన్నారు. వందేమాతరం గేయం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రం అని అభివర్ణించారు.
- Advertisement -
