- సైబర్ జాగ్రుకత దివాస్జి-ల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు..
- సైబర్ నేరాల నుండి బయటపడాలంటే అవగాహన ఒక్కటే మార్గం.. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్
- సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు..
సైబర్ సెక్యూరిటీ బ్యూరో(Cyber Security Bureau) డైరెక్టర్ శికాగోయల్ ఐపిఎస్ గారి ఆదేశాలనుసారం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సైబర్ జాగ్రుకత దివాస్ పేరుతో వివిధ రకాల ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో భారత్ డైనమిక్ గ్రౌండ్ వాకర్ కు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇస్మాయిల్ ఖాన్ పేట విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు.

ముఖ్యమైన అంశాలు:
నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్ములు (వ్యాపార పెట్టుబడి మోసం)
పార్ట్‌టైమ్ ఉద్యోగాల మోసాలు (పెట్టుబడి మోసం)
ఏపీకే ఫైల్స్/తెలియని లింకుల ద్వారా మోసం
డిజిటల్ అరెస్ట్ (ఆన్‌లైన్ బ్లాక్‌మెయిల్ మోసం)


అనే అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ నేరాలు అనేవి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదురుకుంటున్న సమస్య అని, సైబర్ నేరాల నుండి బయటపడాలంటే అవగాహన ముఖ్యం అన్నారు.ఈజీ మనికి అలవాటు పడి, అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో పడవద్దని, ఈజీ మని అంటే మోసం అని గుర్తించాలని అన్నారు. సైబర్ నేరాలకు గురిఅవుతున్న వారిలో విధ్యావంతులే అధికం అని, మల్టీ లెవెల్ మార్కెటింగ్, నకిలీ ట్రేడింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగాల, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ వంటి ఆన్లైన్ మోసాల పట్ల అవగాహ కలిగి ఉండాలని, మొదట డబ్బులు వస్తున్నట్లు ఆశ చూపించి, ఆతర్వాత ఆన్లైన్ మోసాలకు పాల్పడతారని గుర్తించాలన్నారు.

అమాయక ప్రజల బలహీనతే, సైబర్ నేరాగాళ్ల బలంగా.. వివిధ రకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో టెక్నాలజీని వాడుకొని మరిన్ని సైబర్ మోసాలు చేయడానికి అవకాశం ఉందని, సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉన్నప్పుడే సైబర్ నేరాల నుండి బయటపడవచ్చని అన్నారు. డిజిటల్ అరెస్ట్ అంటే ఎవ్వరూ బయపడాల్సిన అవ్యయం లేదని, అసలు డిజిటల్ అరెస్ట్ ఉండదని అన్నారు. ఆన్లైన్ లో అపరిచిత్తులతో పరిచయాలకు దూరంగా ఉండాలని, తెలియని లింక్స్, apk ఫిల్స్ ఓపెన్ చేసి మోసపోవద్దని అన్నారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురి అయినట్లైతే వెంటనే (గోల్డెన్ అవర్)/48 గంటలలోపు 1930 కు కాల్ చేసి గాని, యన్.సి.ఆర్.బి. (https://www.cybercrime.gov.in) పోర్టల్ నందు కాంప్లయింట్ నమోదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భానూర్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ రవి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ D4C, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
