కొత్త ఏసీ కన్వెన్షన్ హాల్‌ను ప్రారంభించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి
కరీంనగర్, నవంబర్ 5 (ఆదాబ్ హైదరాబాద్): కరీంనగర్ పద్మనాయక వెలమ అసోసియేషన్ (Velama Association) ఆధ్వర్యంలో కరీంనగర్ నగరం(Karim Nagar)లోని ముకరాంపురలో నిర్మించిన పద్మనాయక (Padma Nayaka) ఏసీ కన్వెన్షన్ హాల్(AC Convention Hall)ను శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి (Sri Sri Sri Tridandi Chinna Jeeyar Swami) ప్రారంభించారు. అనంతరం హాల్ ఆవరణలో రాములోరి కళ్యాణం, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. చిన్న జీయర్ స్వామితోపాటు వెలమ సంఘం అధ్యక్షుడు జువ్వాడి వేణుగోపాల్ రావు, ప్రధాన కార్యదర్శి చీటీ ప్రకాష్ రావు, ఉపాధ్యక్షుడు గండ్ర సంపత్ రావు, సంయుక్త కార్యదర్శి బోయినపల్లి భూపతి రావు, కోశాధికారి నిమ్మనేని భీంరావు, కార్యవర్గ సభ్యులు జువ్వాడి అనిల్ కుమార్, వాల శంకర్ రావు, చిట్నేని మోహన్ రావు , సుంకిశాల సంపత్ రావు, జూపల్లి మాధవ రావు, ,జోగినిపెల్లి రాజగోపాల్ రావు, పల్లెపాటి వేణుగోపాల్ రావు, ఆయిల్నేని సుధాకర్ రావు, తాండ్ర అశోక్ రావు, బోయినపల్లి గీత, గండ్ర మంజుల, అధిక సంఖ్యలో వెలమ కుల బాంధవులు పాల్గొన్నారు.
