Thursday, February 12, 2026
Homeబిజినెస్Sectors Performance | సెప్టెంబర్‌లో వివిధ రంగాల పనితీరు

Sectors Performance | సెప్టెంబర్‌లో వివిధ రంగాల పనితీరు

సెప్టెంబర్ నెలలో వివిధ రంగాల (Sectors) పనితీరు ఎలా ఉందనేదానిపై జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం.. దేశంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి (Industrial production growth) 4 శాతంగా నమోదైంది. జీఎస్టీ రేట్లు (GST Rates) తగ్గటం, పండగ సీజన్ (Festival Season) నేపథ్యంలో తయారీ రంగం (Manufacturing sector) ఆకర్షణీయ పనితీరు కనబరిచిందని ఎన్ఎస్ఓ తెలిపింది. గనుల (Mines) ఉత్పత్తి 0.4 శాతం క్షీణించింది. విద్యుదుత్పత్తి (Power Gereration) వృద్ధి 0.5 శాతం నుంచి 3.1 శాతానికి పెరిగింది. భారీ యంత్ర పరికరాల రంగ ఉత్పత్తి 4.7 శాతం వృద్ధి చెందింది. మన్నికైన వినియోగ వస్తువుల ఉత్పత్తి 10.2 శాతం పెరిగింది. నిర్మాణ, మౌలిక రంగాల ఉత్పత్తి 3.5 శాతం నుంచి 10.5 శాతానికి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్‌లో) పారిశ్రామికోత్పత్తి 3 శాతం వృద్ధి చెందింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News