నల్గొండ జిల్లాలో శిశు విక్రయాల జోరు మరోసారి బయటపడింది. గిరిజన తండాలే(Tribal Groups) టార్గెట్‌గా దళారులు (Brokers) దందాకు పాల్పడుతున్నారు. ఆడపిల్ల (Girl Child) పుట్టిందనే వివక్షను, పేదల ఆర్థిక అవసరాలను ఈ ముఠా క్యాష్ చేసుకుంటోంది. జిల్లా నుంచి ఏపీ (Andhra Pradesh) ప్రాంతానికి గుట్టు చప్పుడుకాకుండా శిశు విక్రయాలు జరుగుతున్నాయి.
తాజాగా తిరుమలగిరిసాగర్ (Tirumalagirisagar) మండలం ఎల్లాపురం తండాలో శిశు విక్రయం కలకలం రేపింది. ఓ గిరిజన దంపతులకు నలుగురు ఆడపిల్లలు పుట్టడంతో మూడు, నాలుగో సంతానంగా పుట్టిన ఇద్దరు చిన్నారులను వాళ్ల తల్లిదండ్రులు దళారుల ద్వారా గుంటూరు (Guntur) జిల్లాకు చెందినవారికి అమ్మారు. చెల్లి(Sister)ని అమ్మొద్దంటూ ఇద్దరు అమ్మాయిలు తల్లి కాళ్ల మీద పడ్డారు. అయినా ఆ తల్లి ఆగలేదు. పేగు బంధాన్ని కాదనుకొని, కడుపు తీపిని మరిచి కన్న బిడ్డను అమ్మేసుకుంది.
