హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మహిళలు (Women) పిల్లల భద్రత విభాగం ఆధ్వరంలో అవగాహన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ (Anti Human Trafficking) ప్రత్యేక నిర్వహించి రాత్రి దాడుల్లో 10 మంది మహిళా వ్యభిచారిణులు ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఒక బాధితురాలిని రక్షించి కేసు నమెదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేసారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మానవ అక్రమ రవాణ బాలల రవాణా, ఈవ్‌టీజింగ్(Eve teasing), సోషల్‌మీడియా(Social Media), భిక్షాటన(Begging), సైబర్‌బుల్లియింగ్ వంటి మోసాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. దాదాపు 130 మంది పాల్గొన్నారు. సైబరాబాద్ షీ టీం ఈ వారం మొత్తం 135 డేకాయ్ ఆపరేషన్ నిర్వహించి బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించిన 55 మందిని అదపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కౌన్పిలింగ్ అందించారు. వివిధ మార్గాల ద్వారా 25 మంది బాధిత మహిళల ఫిర్యాదులు స్వీకరించారు. వీటితోపాటు భార్యాభర్తల మధ్య వివాదాలను ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి దంపతులను కలపడానికి ప్రయత్నాలు చేశామని డీసీపీ కె.సృజన పేర్కొన్నారు.
