Monday, October 27, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్Insurance Scheme | ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం ప్రారంభం

Insurance Scheme | ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం ప్రారంభం

విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న, చదువుతున్న ఏపీవారికి లబ్ధి

విజయవాడ: ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ధి, భద్రతలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఏపీఎన్ఆర్‌టీ (APNRT) సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని (Pravasandhra Bharosa Insurance Scheme) అందిస్తోంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు (CM Chandra Babu) శనివారం దుబాయ్‌(Dubai)లో ప్రారంభించారు. విదేశాల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందొచ్చు.

ఉద్యోగులు, వలస కార్మికులు, విద్యార్థుల కోసం ఈ పథకం ప్రవేశపెట్టారు. బీమా ఉన్న వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం పొందినా రూ.10 లక్షల ఆర్థిక సాయం పొందుతారు. ఏపీ నుంచి విదేశాలకు వెళ్లిన ప్రతిఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి https://apnrts.ap.gov.in/insuranceను సందర్శించాలి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News