- వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.హిమబిందుపై క్రమశిక్షణా వేటు
- ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ గా డా.నరేందర్‌కు పగ్గాలు…
సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్) ఉన్నత వర్గాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ‘క్రమశిక్షణా చర్యలు పెండింగ్‘లో ఉన్న కారణంగా ప్రిన్సిపాల్ డా.టి.హిమబిందు సింగ్‌ను ఆమె బాధ్యతల నుండి తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.ఆమె స్థానంలో బయో-కెమిస్ట్రీ ప్రొఫెసర్ డా.జి.నరేందర్‌కు తక్షణమే సిమ్స్ ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే,ఈ మార్పులో ఒక విశేషం ఉంది.ప్రిన్సిపాల్ పదవి నుండి రిలీవ్ అయినప్పటికీ,డా.హిమబిందు సింగ్.. పీడియాట్రిక్స్ ప్రొఫెసర్‌గా కొనసాగుతూనే, ప్రిన్సిపాల్ హోదాకు సంబంధించిన పూర్తి వేతనం పొందేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.సిమ్స్ ఉన్నత స్థాయిలో జరిగిన ఈ సంచలన మార్పు స్థానికంగా చర్చనీయాంశమైంది.
