- అడ్డగోలుగా సర్టిఫికెట్ల జారీన వైద్యుడిపై చర్యలు తీసుకునేందుకు మీనవేశాలు.
- సూర్యాపేట జిల్లాలో వైద్య ధ్రువీకరణ వ్యవస్థపై అనుమానాల ముసుగు.
- అక్రమ వసూళ్లు, అనధికార సర్టిఫికెట్లు. నియామకాల నైతికతపై ప్రశ్నార్థకం.
- ఇంతకు ఆ వైద్యుడి పై చర్యలు తీసుకునేదెవరు.?
సూర్యాపేట ప్రతినిధి జిల్లాలో హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ వ్యవస్థలో అవకతవకులపై వార్తలు వెలువడిన ఆ వైద్యుడు తీరుమరలేదు. సూర్యాపేట జిల్లాలో ఇటీవల కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ వ్యవస్థలో పెద్ద ఎత్తున లోపాలు వెలుగు చూస్తున్నాయి. గ్రూప్ 4, ఉపాధ్యాయులు, కానిస్టేబుళ్లు, జూనియర్ లెక్చర్లు, ఇంజనీర్లు తదితర అభ్యర్థులకు ఇచ్చిన ఆరోగ్య ధ్రువపత్రాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫోర్‌మెన్ కమిటీ ఎక్కడ.?
నియమావళి ప్రకారం, ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఫోర్‌మెన్ కమిటీ ఉండాలి. ఈ కమిటీలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, అర్థోఫిట్‌నెస్ నిపుణుడు, కంటి వైద్యుడు, జనరల్ సర్జన్ సభ్యులుగా ఉంటారు. వారు అభ్యర్థులకు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేయాలి. అయితే సూర్యాపేట జిల్లాలో ఆ కమిటీ ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు. దీని కారణంగా వైద్య ధ్రువీకరణ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని తెలుస్తోంది. కొంతమంది వైద్యులు ‘మా మాటే చట్టం’ అన్నట్లుగా హెల్త్ సర్టిఫికెట్లు అడ్డగోలుగా జారీ చేస్తున్న, సంబంధిత శాఖ అధికారులు నిమ్మకి నేరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం డాక్టర్ విజయకుమార్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యమే, అవినీతికి కారణమా? :
అధికారుల నిర్లక్ష్యంతో అవినీతి పెరగడం, ఎటువంటి అధికారిక వైద్య శిబిరాలు నిర్వహించకుండానే సర్టిఫికెట్లు ఇవ్వడం సర్వసాధారణ మైపోయింది. వైద్య శాఖ పై స్థాయి అధికారులు కూడా దీనిపై పెద్దగా స్పందించకపోవడం ప్రజల్లో అనుమానాలను పెంచుతోంది.వైద్య సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయి, పోస్టింగ్‌లు కూడా కేటాయించిన తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఫోర్‌మెన్ కమిటీ ఏర్పడకపోవడమే ఈ గందరగోళానికి మూలంగా మారింది. ఆ కమిటీ తిరిగి ఏర్పడితేనే వైద్య పరీక్షలు సక్రమంగా, పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుందని పలువురు సూచిస్తున్నారు.
చర్యలు ఏవి.?
ఇక ప్రజలు మాత్రం ఆరోగ్య సర్టిఫికెట్ల నిజానిజాలపై ఉన్నతాధికారులు స్వయంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నియామకాల నైతికతతో పాటు అభ్యర్థుల ఆరోగ్య భద్రత కోసం కూడా ఈ అంశం కీలకమని పలువురు హెచ్చరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అవినీతికి పాల్పడుతూ అడ్డగోలుగా హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్న డాక్టర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని, వైద్యులు జిల్లా ప్రజలు కోరుతున్నారు.అయితే డాక్టర్ విజయకుమార్ పై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకువెందుకు తర్జనభజన పడుతున్నారు. మాకు సంబంధం లేదు అంటే, మాకు సంబంధం లేదు అంటూ చేతులెత్తేస్తున్నారు. ఇంతకు ఈ వైద్యుడు పై ఎవరు చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సిందే.!
ఈ విషయం పై జిల్లా ఇంచార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ ను చరవాణి ద్వారా వివరణ కోరగా.. సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ విజయకుమార్ హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్లపై అర్హత లేకుండా సంతకాలు చేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ కు లెటర్ ద్వారా తెలియజేయడం జరిగిందన్నారు. పూర్తి విచారణ చేసి రిపోర్ట్ పెట్టాలని కోరినట్లు ఆదాబ్ కు తెలిపారు. ఈ విషయంపై సూర్యాపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ శ్రావణ్ కుమార్ ను వివరణ కోరగా.. డాక్టర్ విజయ్ కుమార్ పై ఆరోపణలు మా దృష్టికి వచ్చింది. మేము పూర్తి విచారణ చేసి, ఆ రిపోర్టును జిల్లా ఉన్నతాధికారులకు పంపించామన్నారు.
