బీఆర్ఎస్ పార్టీ (Brs Party) కార్యనిర్వాహక అధ్యక్షుడు (Working President) కేటీఆర్(Ktr)కి మరో ప్రతిష్టాత్మక, అంతర్జాతీయ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. శ్రీలంక(Srilanka)లో జరగనున్న గ్లోబల్ ఎకనమిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్(Global Economic and Technology Summit: GETS)–2025లో ముఖ్య ప్రసంగం చేయాలని నిర్వాహకులు కోరారు.
తెలంగాణ(Telangana)ను ఐటీ(IT), పరిశ్రమల రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నెలకొల్పిన వ్యక్తి కేటీఆర్ అని ప్రశంసించారు. అలాంటి వ్యక్తి ఈ సదస్సులో పాల్గొంటే దక్షిణాసియాలోని విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు స్పూర్తి (Inspiration) పొందుతారని ఆహ్వాన లేఖలో GETS–2025 కార్యదర్శి డాక్టర్ హిల్మి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీలంకలోని కొలంబోలో జరగనుంది.
