- మైనింగ్ శాఖ అనుమతులను తప్పొదోవ పట్టించిన ఎమ్ ఐహెచ్ కంపెనీ
- స్వతహా వెంచర్కు అక్రమదారిలో వేల ట్రిప్పుల మొరం తరలింపు
- కోట్ల రూపాయాల విలువైన మొరం తరలించిన అడిగే నాథుడే లేడు
- వెంచర్ దారికోసం ఏకంగా 2 వేల గజాల ప్రభుత్వ భూమి ఆక్రమణ
- దాదాపు రూ.3 కోట్ల విలువ గల భూమి ఎమ్ ఐహెచ్ కంపెనీ మాయం
- ఎమ్ఐహెచ్ కంపెనీపై చర్యలకు వెనకాడుతున్న అధికారులు
- ప్రభుత్వ అధికారుల కుమ్మక్కుతోనే ఈ అక్రమాలంటున్న ప్రజలు
- అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్, సీబీఐ, ఈడీ, కాగ్ విచారణలు జరపాలి

మైనింగ్ శాఖ అనుమతులను తప్పుదోవ పట్టించిన ఘనత ఎమ్ఐహెచ్ కంపెనీ డైరెక్టర్ మంద అశోక్ కే చెల్లుతుంది. ఎందుకంటే డబ్బు.. పరపతి ఉంటే వ్యవస్థలో ఏమైనా చేయోచ్చు అనేందుకు ఆయన అక్రమాలే అద్దం పడుతున్నాయనీ ప్రజలు వాపోతున్నారు. వరంగల్ జిల్లా దేశాయ్ పేట రైతుల నుంచి దాదాపు 15 నుంచి 20 ఎకరాల భూమిని వెంచర్ 40:60 పద్దతిలో అభివృద్ధి కోసం ఎమ్ఐహెచ్ కంపెనీ డైరెక్టర్ మంద అశోక్ తీసుకున్నాడు. కానీ, ఈ వెంచర్కి వెళ్లాలంటే రోడ్డు లేదు దాంతో మంద అశోక్ తమకున్న పరపతితో ప్రభుత్వ భూమిపై కన్నేశారు. దాదాపు రూ.3 కోట్ల విలువైన 2000 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో వెంటనే స్పందించి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మొరం తరలింపులోనూ అక్రమాలు..
రైతుల నుంచి తీసుకున్న భూమిని లెవల్ చేసేందుకు గ్రావెల్ (మొరం) కోసం మంద అశోక్ ఏకంగా మైనింగ్ శాఖ అనుమతులనే తప్పుదారి పట్టించారు. భద్రకాళి మాడ వీధులకు మొరం తరలింపు పేరుతో ఆ శాఖ నుంచి అనుమతులు పొంది.. భద్రకాళి గుడికి తరలించాల్సిన మొరంను ఆయన స్వతహాగా అభివృద్ధి చేస్తున్న వెంచర్కు పెద్దపెద్ద టిప్పర్లతో మొరం తరిలించారు..

అంతేగాక హనుమకొండ జిల్లా దామెర మండలం సింగరాజులపల్లి గ్రామం సర్వే నెంబర్ 141 గల భూమి నుంచి మొరం తరలించేందుకు జి. లింగమూర్తి అను వ్యక్తి కైటెక్స్ అప్పెరల్ పార్క్ లిమిటెడ్ పేరు మీద మైనింగ్ శాఖ నుంచి అనుమతుల పొంది. అక్కడికి తరలించాల్సిన మొరంను మంద అశోక్ వెంచర్కు తరలించాడు. ఈ రెండు అనుమతుల ఉల్లంఘనపై ఇప్పటి వరకు మైనింగ్ శాఖ ఎలాంటి విచారణ చేపట్టలేదు. జరుగుతున్న అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్, సీబీఐ, ఈడీ, కాగ్ విచారణలు జరపాలనీ సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు..
ఎన్నీ అక్రమాలకు పాల్పడిన, ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘించిన మంద అశోక్పై, తమ కంపెనీ ఎమ్ఐహెచ్ చర్యలు తీసుకునేందుకు సంబంధిత ప్రభుత్వ అధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైన చర్యలు తీసుకొని జరిగిన అక్రమాలను వెలుగులోకి తేవాలనీ, ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవాలనీ, అక్రమాలకు పాల్పడిన వారిద్దరిని చట్టపరంగా శిక్షించాలనీ కోరుతున్నారు. మరో కథనంతో ఎమ్ఐహెచ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అవినీతిపైనా “ఆదాబ్ హైదరాబాద్” లోతైన సమాచారం, పూర్తి ఆధారాలతో మీ ముందుకు తెస్తుంది..
