జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వి.నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలుచేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ పి.సాయిరామ్‌కి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్, పొన్నం, మేయర్ విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తల్లితండ్రుల ఆశీర్వదం, యాదగిరి నగర్ శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో నామినేషన్ ర్యాలీకి బయలుదేరారు. ఈ సందర్భంగా డప్పుల శబ్దాలతో, కళా నృత్యాలతో, నినాదాల హోరుతో జూబ్లీహిల్స్ వీధుల్లో సందడి నెలకొంది.

