అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో ఒకే రోజు నలుగురు అధికారులు చిక్కారు. ఈ సంఘటనలు వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వరంగల్ జిల్లా మత్స్య శాఖ అధికారి అల్లు నాగమణి రూ.70 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో కొత్తవారికి సభ్యత్వం ఇచ్చేందుకు డబ్బు డిమాండ్ చేసి పట్టుబడ్డారు. ఫీల్డ్ ఆఫీసర్ పెద్దబోయిన హరీష్ సైతం అవినీతికి పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యారు. ఏసీబీ అధికారులు వీరి నుంచి నగదు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచారు. వికారాబాద్ జిల్లాలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు బొల్లుమల్ల సాయికుమార్, మహ్మద్ మొయినొద్దీన్, డ్రైవర్ బాలనగరం రూ.30 వేలు లంచం పుచ్చుకుంటూ ఏసీబీ వలలో పడ్డారు. అడవి నుంచి సీతాఫలాలను రవాణా చేసేందుకు అనుమతి కోరగా డబ్బు ఇవ్వాలని అడిగారు. వీరిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.
ACB: ఏసీబీ వలలో ఒకే రోజు నలుగురు అధికారులు
RELATED ARTICLES
- Advertisment -
