Monday, October 27, 2025
ePaper
Homeతెలంగాణతెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

  • స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై విచారణకు సుప్రీం తిరస్కరణ
  • హైకోర్టు విచారణపై జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం
  • 50 శాతం పరిమితి దాటవద్దని సుప్రీంకోర్టు స్పష్టం
  • పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లవచ్చని ప్రభుత్వానికి సూచన
  • హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని వెల్లడి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ ఎస్‌ఎల్‌పీని సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లండని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని ధర్మాసనం హైకోర్టుకు సూచించింది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తమ ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని.. మెరిట్స్‌ ప్రకారం విచారించాలని హైకోర్టుకు సూచించింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది.

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీఓ 9పై హైకోర్టు విధించిన స్టేను సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఈ నెల 9న జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 13వ తేదీన పిటిషన్‌ దాఖలుచేసింది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా 16, 17వ తేదీల్లో ఏదో ఒకరోజు ఈ అంశంపై విచారించాలని మంగళవారం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ ముందు మెన్షన్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగానే రిజిస్టీ ఈ కేసును గురువారం విచారణ జాబితాలో చేర్చింది. అయితే సుప్రీంకోర్టు దీనిపై విచారణకు నిరాకరించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్‌ సింఫ్వీు వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50 శాతం మించొద్దనే అభిప్రాయం సరికాదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన సర్వే జరిగిందని, ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి లెక్క తేల్చిందని సర్వోన్నత న్యాయస్థానంకు వివరించారు.

రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని, 3 నెలలు దాటినా బిల్లుపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోలేదని అభిషేక్‌ సింఫ్వీు వాదించారు. రిజర్వేషన్లు 50 శాతం మించొద్దన్న తీర్పులు స్పష్టంగా ఉన్నాయని, కృష్ణమూర్తి జడ్జిమెంట్‌ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిందని ప్రతివాది లాయర్‌ వాదనలు బలంగా వినిపించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో పెండిరగ్‌లో ఉండటంతో విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. సుప్రీంకోర్టు నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి తీసుకునే చర్యలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. కేబినెట్‌ భేటీలో ఈ అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News