తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. అయితే ‘ముగ్గురు పిల్లల’ నిబంధన అభ్యర్థులను వెంటాడుతోంది. అయితే కొందరికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది. 31.5.1995 కంటే ముందు ముగ్గురు పిల్లలున్న వారు పోటీ చేయవచ్చు. 1.5.1995కు ముందు ఒక సంతానం కలిగి, తర్వాత కాన్పులో కవల పిల్లలు జన్మిస్తే కూడా పోటీకి అర్హులు. 1.6.1995 తర్వాత ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించినా అర్హులే. ముగ్గురు పిల్లలు పుట్టినా నామినేషన్ పరిశీలనకు ముందే వారిలో ఒకరు చనిపోతే.. ఆయా అభ్యర్థులను అర్హులుగా పరిగణిస్తారు.