- ఓట్ చోరీపై గ్రామాల్లో సంతకాల సేకరణ
- టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
ఓటు చోరీతోనే మూడోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చారని టీపీసీసీ (TPCC) అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అదే ఓటు చోరీతో మూడోసారి కూడా ప్రధాని కాగలిగారని, ఓటుచోరీ జరిగిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఓటుచోరీని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బయటపెట్టారని చెప్పుకొచ్చారు. ఓటు చోరీతో ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఓటు చోరీ విషయంలో ప్రతి గ్రామంలో వందకు పైగా సంతకాలను సేకరిస్తున్నామని తెలిపారు. ఓటు చోరీ (VOTE CHORI) జరిగిందని నమ్ముతూ తాను సంతకం పెడుతున్నానని మహేష్ కుమార్ గౌడ్(MAHESH KUMAR GOUD) పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో కనీసం వందకి తగ్గకుండా సంతకాలను టీపీసీసీ చేపడుతుందని తెలిపారు.