జిహెచ్‌ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ తీర్మానం
తెలుగుతల్లి (Telugu Talli Flyover) ఫ్లై ఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌గా మార్చాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా నామకరణం చేస్తూ కార్పొరేషన్‌కు సిఫార్సు చేయాలని జీహెచ్‌ఎంసి (GHMC) స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదించింది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో జరిగింది. కమిటీ సమావేశంలో 14 ఎజెండా అంశాలు, 10 టేబుల్ ఐటమ్ లకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.
స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణం సాయి నగర్ ఆర్చ్ నుండి టి.ఐ.ఎఫ్.ఆర్ కాంపౌండ్ వాల్ కల్వర్ట్ వరకు, వార్డు నం.3లోని కృష్ణారెడ్డి నగర్ రోడ్ నం.1, రోడ్డు నం.2, కాప్రా సర్కిల్, చర్లపల్లి లో రూ.285.00 లక్షల అంచనా వ్యయంతో నిర్మించేందుకు కార్పొరేషన్‌కు సిఫార్సు పరిపాలన ఆమోదం కోరబడిరది. సీసీ రోడ్డు నిర్మాణం అల్వల్ సర్కిల్ వార్డు నం.133లో హై టెన్షన్ లైన్ మార్గంలో వి.బి.ఆర్ గార్డెన్స్ నుండి ఎస్.ఎన్. రెడ్డి ఎన్ క్లేవ్ వరకు 2025-26 ఆర్థిక సంవత్సర నిధులు రూ.450.00 లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మణానికి టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇచ్చింది. కాప్రా సర్కిల్ వార్డు నం. 2 లో భవాని నగర్ నుండి బావి బజార్ నాలా విూదుగా ఇ.టి.డి.సి నార్త్ కమలా నగర్ నాలా వరకు రూ.395.00 లక్షల వ్యయంతో చేపట్టనున్న ’ఆర్‌సిసి బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి కార్పొరేషన్‌కు సిఫార్సు – పరిపాలన ఆమోదించారు.
మల్కాజిగిరి సర్కిల్, డివిజన్ 136లో ఆర్‌కే పురం ఫ్లై ఓవర్ కింద స్పోరట్స్ జోన్ ఆపరేషన్, నిర్వహణ బాధ్యతలను అనుభవజ్ఞులైన ఏజెన్సీకి అప్పగించేందుకు ఆమోదించారు. మూసాపేటలోని కెపిహెచ్‌బి మల్టీపర్పస్ స్పోర్ట్ కాంప్లెక్స్ లో వివిధ స్పోరట్స్ కార్యకాలపాలకు యూజర్ చార్జీలు ఫిక్స్ చేయడం కోసం ఆమోదం కొరకు సమర్పణ. బండ్లగూడ మల్టీపర్పస్ స్పోరట్స్ స్టేడియంలో అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగుల నియామకానికి అనుమతి కోరింది. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కవిూషనర్ ఆర్.వి కర్ణన్, స్టాండింగ్ కమిటీ- సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.