బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్22వ తేది నుంచి దసరా మహోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. అక్టోబర్ 3వ తేది వరకు జరిగే ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులు ఇప్పటికే సవిూక్ష నిర్వహించారు. భక్తులకు అవసరమైన వసతి సౌకర్యాలు గురించి చర్చించారు. అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాలు, వివిధ మండపాలకు ప్రతి ఏడాది మాదిరిగానే విద్యుత్‌దీపాలతో అలంకరించాలని అందుకు సంబంధించి పనుల కోసం టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు,అక్షరాభ్యాసాలకు లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఇవో తెలిపారు.