Monday, October 27, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్అన్నదాతా.. మేలుకో

అన్నదాతా.. మేలుకో

తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు రానే వచ్చాయి. రైతన్నలు దుక్కి దున్ని పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా నాసిరకం విత్తనాలు అమ్మేందుకు నకిలీగాళ్లు కొంత మంది అధికారుల అండదండలతో నాయకుల తెరచాటు సపోర్టుతో మార్కెట్‌లో కాసుకొని కూర్చున్నారు. కాబట్టి రైతన్నలారా జరభద్రం. ప్రభుత్వం మారితే మన బతుకులు మారతాయి అనుకున్నాం. నాణ్యమైన విత్తనాలు లభిస్తాయని ఆశపడ్డాం. కానీ అవన్నీ భ్రమలేనని తేలిపోయింది. మంచి విత్తనం వేస్తే తప్ప మనకు బతుకు లేదు. ఏ ప్రభుత్వాలూ మన తలరాతను మార్చవు. మన బతుకుకి మనమే పూలబాట వేసుకోవాలి. పనికిరాని, మొలకెత్తని విత్తనాలను అంటగట్టేవాళ్లతో జాగ్రత్త రైతన్నా.

RELATED ARTICLES
- Advertisment -

Latest News