Friday, September 12, 2025
ePaper
spot_img
Homeకెరీర్ న్యూస్విద్యాహక్కు చట్టం అమలుపై విచారణ

విద్యాహక్కు చట్టం అమలుపై విచారణ

విద్యాహక్కు చట్టం అమలుపై దాఖలైన పిల్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలని సామాజిక కార్యకర్త తాండవ యోగేశ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్‌టీఈ వచ్చి 16 ఏళ్లు గడుస్తున్నా విద్యార్థులకు అందుబాటులోకి రాలేదని తెలిపారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యాహక్కు చట్టం అమలులో ఉందని గుర్తుచేశారు. దీని ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. మరోవైపు గతేడాది అక్టోబర్‌లో విద్యాహక్కు చట్టంపై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తెస్తామని అందులో పేర్కొంది. దీని అమలుకు సంబంధించిన పురోగతిపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీజే ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News