Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణపకడ్భందీగా కొత్త రెవెన్యూ చట్టం అమలు

పకడ్భందీగా కొత్త రెవెన్యూ చట్టం అమలు

భూ భారతి విధివిధానాలు రూపొందిస్తున్నాం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

పకడ్భందీగా కొత్త రెవెన్యూ చట్టం అమలుకు భూ భారతి విధివిధానాలు రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) అన్నారు. హైదరాబాద్‌ లోని ఎంసీహెచ్‌ఆర్డీలో రెవెన్యూశాఖ అధికారులతో సవిూక్ష జరిపిన పొంగులేటి.. గత సర్కార్‌ హయాంలోని రెవెన్యూ చట్టంలో అన్నీ లోపాలు, లొసుగులే ఉన్నాయన్నారు. చట్టం తీసుకొచ్చి మూడేల్ళైనా విధివిధానాలు రూపొందించలేదన్నారు. మేధావులు,నిపుణులతో చర్చించి కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం భూ భారతిని తీసుకొచ్చిందని చెప్పారు పొంగులేటి. భూ భారతి చట్టం తరతరాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందన్నారు. వీలైనంత త్వరగా విధివిధానాల రూపొందించి.. భూ భారతి రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తామని తెలిపారు. భూ భారతి చట్టం పెను మార్పులు తీసుకొస్తుందన్నారు. 2024 డిసెంబర్‌ 20 తెలంగాణ భూ భారతి 2024 బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. జనవరి 9న తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదం తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News