Saturday, April 4, 2026
Homeక్రైమ్ వార్తలుSrikakulam | బాదంపాలు తాగి 80 మంది ఆస్పత్రిపాలు..

Srikakulam | బాదంపాలు తాగి 80 మంది ఆస్పత్రిపాలు..

  • శ్రీకాకుళం జిల్లాలో ఘటన..
  • చికిత్స అందిస్తున్న వైద్యులు..

శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలో బాదంపాలు తాగి సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపులో నొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో బాధపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. సింగుపురంలో ఈ నెల 1, 2వ తేదీల్లో కొండమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి వ్యాన్‌లో బాదం పాలు తీసుకొచ్చి పాత పంచాయతీ కార్యాలయం వేప చెట్టు కింద విక్రయించాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జాతరకు వచ్చిన వారిలో చాలామంది ఆ బాదం పాలు కొనుగోలు చేసి తాగారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నుంచి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రుల బాట పట్టారు. ఈ ఘటనపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక బృందాన్ని నియమించి సమగ్ర విచారణ చేయిస్తున్నామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News