Tuesday, March 3, 2026
Homeమహబూబ్‌నగర్‌పర్వతగిరిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

పర్వతగిరిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

  • ఊరూరా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ, ప్రభుత్వెతర కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ఊరు వాడ పురవీధుల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్, మదర్ తెరిస్సా మండల సమైక్య లో ఏపిఎం రాజీర్, పోలీస్ స్టేషన్లో ఎస్.ఐ ప్రవీణ్ కుమార్, సాంఘిక సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ అపర్ణ జాతీయ జెండాలు ఎగరవేశారు. సిబ్బందితో కలిసి జనగణమన గీతాన్ని ఆలపించారు.

మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులు విద్యా వ్యాపార వాణిజ్య సంస్థల్లో సర్పంచ్ లు పర్వతగిరిలో చీదురు శంకర్, చౌటపల్లిలో మట్టపల్లి వెంకటేశ్వరరావు, అనంతారం తౌటి శ్రీలత, గోపనపల్లిలో నాంపల్లి విజయ, అన్నారం షరీఫ్ గాడిపెళ్లి మహేందర్, కొంకపాకలో రాయబారపు రమాదేవి తో పాటు అన్ని గ్రామాల్లో ప్రజా సర్పంచులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

- Advertisement -

77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయా కార్యాలయాలలో డిప్యూటీ తాసిల్దార్, ఎంఆర్ఐ భారతి, ఏపీవో సుశీల్, సూపర్డెంట్, మదర్ తెరిస్సా మండల సమైక్య ప్రతినిధులు స్వప్న ఫరీదా సీ.సీలు గోలి కొమరయ్య, శ్యాంసన్, సుధాకర్, దేవేంద్ర, ఈ.సీ రాజు, జిపిఓ లు బిర్రు ఎల్లయ్య, యాకయ్య మొదలగు సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో పంచాయతీ కార్యదర్శులు ప్రజాప్రతినిధులు కార్యాలయ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News