- అత్త ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించిన కోడలు
- ఆసుపత్రి నుండి అదృశ్యమైన వృద్ధురాలు కోసం గాలిస్తున్న పోలీసులు
వైద్యం పొందేందుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పెద్ద ఆసుపత్రిగా గుర్తింపు కలిగిన గాంధీ హాస్పిటల్ లో 70 ఏళ్ల వృద్ధురాలు అదృశ్యమైన ఘటన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం పలుగుగడ్డ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్ లో అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆదివారం ఉదయం 10.00 గంటలకు పలుగుగడ్డ గ్రామానికి చెందిన షేక్ జరీనా (34),భర్త షేక్ రహీం,వృత్తి బీడి కార్మికురాలు వైద్యం కోసం వచ్చిన మా అత్త కనిపించడం లేదంటూ పోలీసులకు పిటిషన్ సమర్పించారు.ఆమె తెలిపిన వివరాల ప్రకారం,తన అత్త షేక్ బిపాషా (70),భర్త లేట్ షేక్ అల్‌సీబ్,రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి తీవ్రంగా తగ్గిపోవడంతో ఫిబ్రవరి 19 గురువారం రోజున రాత్రి సుమారు 10.00 గంటలకు గాంధీ ఆసుపత్రిలో చేర్పించడం జరిగిందన్నారు.
కాగా శనివారం ఉదయం సుమారు 5.30 గంటలకు అల్ట్రాసౌండ్ టోకెన్ తీసుకునేందుకు కౌంటర్ వద్దకు వెళ్లి తిరిగి జనరల్ వార్డుకు వచ్చేసరికి,షేక్ బిపాషా కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.ఆసుపత్రి పరిసర ప్రాంతాలు,వార్డులు మరియు ఇతర సాధ్యమైన ప్రదేశాలలో కుటుంబ సభ్యులు విస్తృతంగా గాలించినప్పటికీ ఎటువంటి సమాచారం లభించలేదని తెలిపారు.
బంధువులు,పరిచయస్తులను కూడా సంప్రదించినా ఆమె జాడ దొరకలేదు.చివరకు అత్త తప్పిపోయిందని గ్రహించిన కోడలు చిలకలగూడ పోలీసులను సంప్రదించి అత్తగారి ఆచూకీ తెలిపాలని పిటిషన్ అందించడం జరిగింది.ఈ ఘటనపై చిలకలగూడ అధికారులు,పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
