కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్: పుదుచ్చెరి చరిత్ర 3వ మహా సమావేశాలు శనివారం వీర నారి చాకలి ఐలమ్మ (Veera Nari Chakali Ailamma) యూనివర్సిటీలోని బ్రిటిష్ రెసిడెన్సీ(British Residency)లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. మానవాభివృద్ధి వికాసానికి భాష (Language) ఎంతో అవసరమని చెప్పారు. వీసీ మాట్లాడుతూ.. భాషను పరిరక్షించుకుంటూ భవిష్యత్ తరాలకు అందజేయాలని సూచించారు. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ చైర్‌పర్సన్, గెస్ట్ ఆఫ్ హనర్స్ డాక్టర్ తేజస్విని యార్లగడ్డ మాట్లాడుతూ.. భాష పరిరక్షణ కోసం ఎల్‌ఎల్‌ఎం ప్లాట్‌ఫామ్‌ను వాడాలని తెలిపారు. దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయలు, కళాశాలాల నుంచి ప్రతినిధులు, చరిత్రకారులు, పీహెచ్‌డీ విద్యార్థులు పాల్గొన్నారు.
