Thursday, February 12, 2026
HomeజాతీయంISRO | కౌంట్‌డౌన్‌..

ISRO | కౌంట్‌డౌన్‌..

  • శ్రీహరికోటలో బ్లూబర్డ్‌ బ్లాక్‌`2 మిషన్‌ 24 గంటల కౌంట్‌డౌన్‌ ప్రారంభం
  • అమెరికా కమ్యూనికేషన్‌ ఉపగ్రహం బ్లూబర్డ్‌6ను మోసుకెళ్లనున్న ఎల్‌వీఎం3ఎం6
  • వాణిజ్య, ప్రభుత్వ అప్లికేషన్లకు సపోర్ట్‌ చేసేలా రూపొందించిన ఇస్రో
  • నేటి ఉదయం 8.54గంటలకు నిందిలోకి ఎగరనున్న రాకెట్‌..

కొత్త తరం అమెరికా కమ్యూనికేషన్‌ ఉపగ్రహం బ్లూబర్డ్‌6ను మోసుకెళ్లే ఎల్‌వీఎం3ఎం6 రాకెట్‌ ప్రయోగానికి 24 గంటల కౌంట్‌డౌన్‌ మంగళవారం శ్రీహరికోటలో ప్రారంభమైనట్లు ఇస్రో ప్రకటించింది. బ్లూబర్డ్‌ బ్లాక్‌2 మిషన్‌ కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైందని, బుధవారం ఉదయం 8.54 గంటలకు రాకెట్‌ నింగిలోకి ఎగరనున్నట్లు వెల్లడిరచింది.ఈ ఉపగ్రహం బరువు సుమారు 6,100 కిలోలు ఉంటుంది. స్పేస్‌పోర్ట్‌లోని రెండో లాంచ్‌ ప్యాడ్‌ నుంచి ఎల్‌వీఎం3ఎం6 వ్యోమనౌకను ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు.

అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్‌ మొబైల్‌ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తోంది.శాటిలైట్‌ ద్వారా నేరుగా మొబైల్‌ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు ఈ బ్లూబర్డ్‌ బ్లాక్‌`2 మిషన్‌. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా, ఏ సమయంలోనైనా నేరుగా 4జీ, 5జీ వాయిస్‌, వీడియో కాల్స్‌, మెసేజ్‌లు, వీడియో ప్రసారాలు చేసేందుకు వీలుగా ఈ ప్రయోగం చేపట్టారు. వాణిజ్య, ప్రభుత్వ అప్లికేషన్లకు సపోర్ట్‌ చేసేలా దీనిని రూపొందించారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News