Friday, September 12, 2025
ePaper
spot_img
Homeతెలంగాణతెలంగాణకి భారీగా ఉల్లి దిగుమతి

తెలంగాణకి భారీగా ఉల్లి దిగుమతి

ఒక్క రోజే 141 లారీల్లో వచ్చిన సరుకు

తెలంగాణ రాష్ట్రంలోకి గతంలో ఎన్నడూలేనివిధంగా పెద్ద సంఖ్యలో ఉల్లి దిగుమతి అయింది. ఏప్రిల్, మే నెలలు ఉల్లిగడ్డ పంట దిగుబడి సీజన్. అందువల్ల పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఇంపోర్ట్ అవుతుండటం సహజం. అయితే ఈ సంవత్సరం జూన్ నెలలోనూ భారీగా ఉల్లి దిగుమతి అవుతోంది. సోమవారం (జూన్ 2న) ఒక్కరోజే హైదరాబాద్‌లోని ప్రధాన మార్కెట్ అయిన మలక్‌పేట గంజ్‌కు ఏకంగా 141 లారీల ఉల్లిగడ్డ దిగుమతి జరిగినట్లు ఆఫీసర్లు చెప్పారు. అందులో 105 లారీలు కేవలం మహారాష్ట్ర నుంచే రావటం గమనార్హం. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 43 వేల ఉల్లి బస్తాలు సిటీకి వచ్చాయి. ఈ ఉల్లి ధర క్వింటా రూ.1500 నుంచి రూ .1800 చెబుతున్నారు. ఓపెన్ మార్కెట్‌లో దీనికి డబుల్ రేటుకు కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News