Monday, October 27, 2025
ePaper
Homeకెరీర్ న్యూస్ఇస్రోలో 320 సైంటిస్ట్/ఇంజనీర్ ఉద్యోగాలు

ఇస్రోలో 320 సైంటిస్ట్/ఇంజనీర్ ఉద్యోగాలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 320 సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో 113 ఖాళీలు, మెకానికల్‌లో 160 ఉద్యోగాలు, కంప్యూటర్ సైన్స్‌లో 44 వేకెన్సీ, ఎలక్ట్రానిక్స్ పీఆర్ఎల్‌లో 2 జాబులు, కంప్యూటర్ సైన్స్ పీఆర్ఎల్‌లో 1 పోస్టు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో బీఈ లేదా బీటెక్ చేసినవారు అర్హులు. 2025 జూన్ 16లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. అంతకన్నా ముందు నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వివరాలకు www.isro.gov.inను సందర్శించొచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News