మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు
పదేళ్ల BRS పాలనలో జూబ్లీహిల్స్(JubileeHills)లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మల్కాజిగిరి (Malkajgiri) ఎంపీ (Mp) ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. రేండేళ్లుగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రభుత్వం సైతం గతుకుల రోడ్లు బాగుచెయ్యలేదని విమర్శించారు. మంచి నీరు (Water) కూడా అందించట్లేదని అన్నారు. ఈ రెండు పార్టీల కారణంగా జూబ్లీహిల్స్, మధురానగర్ ప్రాంతాల్లో కంపు వాసన (Smell) వస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ డివిజన్ మధురానగర్‌లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న ఈటల.. పేదవారి కోసం కొట్లాడే పార్టీ బీజేపీ(BJP)యేనని తెలిపారు. అందుకే దీపక్ రెడ్డి(Deepak Reddy)ని గెలిపించేందుకు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
