Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeబిజినెస్కొండాపూర్‌లో జెన్నారా క్లినిక్స్‌ ప్రారంభం

కొండాపూర్‌లో జెన్నారా క్లినిక్స్‌ ప్రారంభం

చర్మ సంరక్షణ, సౌందర్య చికిత్సల్లో ముందంజలో ఉన్న జెన్నారా క్లినిక్స్‌ కొత్త బ్రాంచ్‌ను కొండాపూర్‌లో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి శ్రీయా శరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొండాపూర్‌లో వేగంగా పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో చర్మ పునరుత్తేజ చికిత్సలు, జుట్టు పెరుగుదల కోసం పీఆర్‌పీ, ఫేషియల్స్, మొటిమలు, మచ్చల నివారణ, యాంటీ ఏజింగ్ సొల్యూషన్స్‌తో పాటు వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉండనున్నాయి. జెన్నారా డైరెక్టర్ ప్రియాంక రెడ్డి ముత్యాల మాట్లాడుతూ, “కొండాపూర్ బ్రాంచ్ మా ప్రయాణంలో ఒక మైలురాయి. ప్రపంచ స్థాయి చికిత్సలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం” అన్నారు. మరో డైరెక్టర్ మహేశ్వరి మాట్లాడుతూ, “జెన్నారాలో చికిత్సలు కేవలం అందం కోసమే కాదు, ఆత్మవిశ్వాసం కోసం రూపొందించబడ్డాయి” అని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News