- ఫేస్బుక్లో పరిచయమైన ప్రియుడితో వెళ్లిపోయిన భార్య
- పోలీసుల సమక్షంలోనే భార్యను కత్తితో పొడిచి హ*త్య చేసిన భర్త
జహీరాబాద్‌లో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఫేస్బుక్లో పరిచయమైన ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను భర్త, పోలీసుల సమక్షంలోనే కత్తితో పొడిచి హ*త్య చేసిన సంఘటన సంచలనం సృష్టించింది.ఝరాసంగం మండలం తుమ్మన్పల్లికి చెందిన సిద్ధారెడ్డి (35), కవిత (29) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవనోపాధి కోసం జహీరాబాద్ పట్టణంలో అద్దెకు ఉంటూ, సిద్ధారెడ్డి పానీపూరి బండి నడుపుతుండగా కవిత ఇంట్లో టైలరింగ్ పని చేసేది.
ఇటీవల కవితకు పేస్ బుక్ ద్వారా పవన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఈ క్రమంలో మార్చి 27న కవిత తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది.భార్య కనిపించకపోవడంతో సిద్ధారెడ్డి మార్చి 30న పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కవిత జెడ్చర్లలో తన ప్రియుడితో ఉన్నట్లు గుర్తించారు.పోలీసులు కవితకు కౌన్సెలింగ్ నిర్వహించి భర్తతో వెళ్లాలని సూచించినా, ఆమె తిరస్కరించింది.
దీంతో భార్యాభర్తల మధ్య వాగ్వివాదం జరిగింది.తర్వాత ముగ్గురూ కలిసి కారులో జహీరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో సిద్ధారెడ్డి చాకుతో కవితపై దాడి చేసి గొంతు, మెడపై తీవ్రంగా గాయపరిచాడు. వెంటనే పోలీసులు ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఆమె మృతిచెందినట్లు ప్రకటించారు.పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
