Thursday, March 26, 2026
Homeఆజ్ కీ బాత్యువతా.. మార్చుకో నడత

యువతా.. మార్చుకో నడత

ఈరోజుల్లో కొంత మంది యువత లక్ష్యాన్ని మరచి తిరుగుతున్నారు. నిర్లక్ష్యంగా కాలాన్ని గడిపేస్తున్నారు. అడ్డగోలు వ్యవహారాల్లో తలదూర్చుతున్నారు. చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. పనికి రాని విషయాల్లో దూరి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి మరెన్నో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే.. సంతానం తమ కళ్ల ముందే పెరిగిపెద్దయి దారితప్పుతుంటే సరిదిద్దలేక పలువురు పేరెంట్స్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. బంగారు భవిష్యత్తును అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాల్సిన కొంత మంది యువత ఈ విధంగా జీవితాన్ని నిర్వీర్యం చేసుకోవటం విచారకరం. చేతులు కాలాక ఆకులు పట్టుకోకుండా యువత సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఒక లక్ష్యాన్ని చేరుకుంటే.. వారికీ.. కన్నవారికీ.. యావత్ సమాజానికీ ప్రయోజనకరంగా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News