వ్యవసాయ పొలంలో విద్యుత్తు షాక్ తగిలి కూలి మృతి చెందిన ఘటన చిలిపిచేడ్ మండలంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. చిట్కూల్ గ్రామానికి చెందిన బ్రాహ్మణపల్లి శివకుమార్ (27) గ్రామ శివారులో వ్యవసాయ పొలంలో గడ్డి కోత మిషన్ తో గడ్డి కోస్తుండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుత్ షాకుతో యువకుడు మృతి
RELATED ARTICLES
- Advertisment -