సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో. అప్పుల బాధతో యువకుడు ఆత్మహ*త్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కుకునూరు పల్లి ఎస్‌ఐ పి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం కొండపాకకు చెందిన తడకపల్లి కర్ణకర్ (27) మెస్త్రీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది నెలల క్రితం వెల్టోస్ బ్యాంకు ద్వారా రూ.9 లక్షల రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకున్నాడు. అయితే ఇటీవల పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
దీంతో కిస్తీలు చెల్లించలేకపోవడం కర్ణకర్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు “పనికి పోతాలేవు ఇల్లు అప్పు, ఎలా కడతావు అంటూ మందలించడంతో మనస్థాపానికి గురైన కర్ణకర్, బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహ*త్య చేసుకున్నాడు.
