Wednesday, February 11, 2026
Homeహైదరాబాద్‌Drunk and Drive | తప్పతాగి తప్పించుకోలేరు..!!

Drunk and Drive | తప్పతాగి తప్పించుకోలేరు..!!

పగలు..రాత్రీ డ్రంకెన్‌ డ్రైవ్‌..!!
ఉహాదారి ఉల్లంఘనుల కేసుల నమోదు..!!
పోలీసుల ట్యాబ్‌లో మందుబాబుల చిట్టా…!!
ఫోటోరైటప్‌…వాహనదారుని తనికి చేస్తున్న పోలీసు,ట్రాఫీక్‌ అదనపు కమిషనర్‌ డాక్టర్‌ గజరావు భూపాల్‌ ఐపీఎస్‌, మాధపుర్‌ ఏసీపీ చంద్రశేఖర్‌రెడ్డి…!!

ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి: రాజధాని నగర శివారు ప్రాంత రహాదారులపై మోతాదుకు మించి మద్యం తాగి ఇష్టానుసారంగా రోడ్లపైకి వస్తున్న వారిపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు బ్రీత్‌ఎనలైజర్స్‌తో దృష్టి కేంద్రీకరించారు. పగలూ..రాత్రీ..తేడాలేకుండా డ్రంకేన్‌ డ్రైవ్‌ (Drunk and Drive) పేరుతో తనిఖీలు నిర్వహిస్తున్నారు.చౌరస్తాతో పాటు అనుసంధాన రహాదారుల్లో వెళ్తున్న వారిని తనిఖీలు చేస్తున్నారు.మోతాదుకు మించిమద్యం తాగిన వారిపై కేసులు నమోదుచేస్తున్నారు. రోజుకు సగటున 100మంది మందుబాబులపై కేసు నమోదు చేస్తుండడం గమనార్హం.ట్రాఫిక్‌ పోలీసులకు దొరక్కుండా వేర్వేరు మార్గాల్లో జారుకునే వారిని గుర్తించేందుకు డ్రంకన్‌ డ్రైవ్‌ ప్రాంతాలను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు (Cyberabad Traffic Police) మందుబాబులపై దృష్టిసారించడంతో కేవలం కొన్ని నేలల వ్యవధిలో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. పదేపదే మద్యం తాగి పోలీసులకు దోరికి పోయిన వాహానచోదక అనుమతి పత్రాలు తాత్కలిక రద్దుకు రవాణశాఖ కు సిఫారిసు చేస్తున్నారు.రహాదారులపై ప్రమాదాలు తగ్గేంత వరకూ ఇదే పంథాను కొనసాగించనున్నామని పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు.

- Advertisement -

నటిస్తున్నా…పట్టేస్తామన్నా….!!


ఇటివల మందుబాబులు పోలీసులకు దోరక్కుండా కొత్త పంథాలో ముందుకు సాగుతున్నారు.రహాదారులపై డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులను చూడగానే వాహానం దిగి ఉన్నట్టుంటి గుండేను పట్టుకుని కూలిపోవడం..మూర్చ (Fits) వ్యాధి వచ్చినట్లు నటించడం..శ్వాసతీసుకోవడం కష్టంగా ఉందటూ రోడ్డుపక్కాన వెళ్లి కూర్చోవడం.వాహనం దిగకుండానే మేం.రాజకీయనాయకుల వారసులమని, బడవ్యాపారుల పిల్లలని, ఐఎఏస్‌,ఏపీఎస్‌ వారసులమంటూ చెబుతున్నారు. మందుబాబుల ఆహార్యం వారి ముఖ కవళికలను గమనించిన ట్రాఫీక్‌ పోలీసులు నిజంగా అస్వస్థతపాలైతే ఆసుపత్రులకు తీసుకేళ్తున్నారు. వైద్యులు (Doctors) పరీక్షీంచాక అబద్ధమని తేలితే జరిమానాతో పాటు పాయింట్లను మందుబాబుల ఖాతాల్లోకి వేస్తున్నారు.శ్వాస పరీక్షలకు తప్పించుకునేందుకు ఎలాంటి సాకులు చూపుతారన్న అంశాలపై క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.జబ్బు పేరుతో నాటకాలాడిన వారి వైనాన్ని వీడియో చిత్రీకరించి యూట్యూబ్‌లో ఉంచుతున్నారు.


డ్రంకేన్‌ డ్రైవ్‌ కేసుల నమోదు తీరు….!!


వారం రోజుల నుండి ట్రాఫీక్‌ పోలీసులు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి నిబంధనాలకు విరుద్దంగా వాహానాలు నడుపుతున్న 457 మందుబాబులపై కేసు నమోదుచేసారు. అందులో ద్విచక్రవాహనాలు 346, ఆటోలు 20, కార్లు 86, హెవివాహానాలు.05, పట్టుకుని సెక్షన్‌ 105 బిఎన్‌ఎస్‌ ప్రకారం కేసులు నమోదుచేసారు. తెది ఆక్టోబర్‌ 20నుంచి 25వ తేది వరకు నిర్వహించిన డీడీ కేసులో 317మందిపై కేసు నమోదుచేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచాగా 19మందిని సాధరణజైలు శిక్ష విధించారు.మిగిత వారు జరిమాన కట్టారు.23మంది వ్యక్తులు సామాజీక కార్యక్రమంలో పాల్గోలని న్యాయస్థానం అదేశించింది.


అనూహ్యంగా తనిఖీలు పక్కాగా శ్వాస పరీక్షలు…!!


మోతాదుకు మించి మద్యం తాగిన అనంతరం కొందరు మందుబాబులు బైకులు కార్లు. లారీలు,నడుపుకోంటు వేగంగా గమ్యస్థానాలను చేరుకుంటున్నారు.డ్రంకేన్‌డ్రైవ్‌ నిర్వహిస్తున్నా ప్రాంతాలను ముందుగానే గుర్తించి వేర్వేరు మార్గాల్లో వెళ్తూన్నారు. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వీరిని ఎలాగైన పట్టుకోవాలన్నా లక్ష్యంతో మందుబాబులు తప్పించుకుని వెళ్లే మార్గాల్లోను డ్రంకెన్‌డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు.చట్టం ప్రకారం మద్యం తాగినవారి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30మిల్లీగ్రాముల అల్కాహాల్‌ వరకే అనుమతి.అంతకు మించితే మద్యంతాగిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తున్నారు. బ్రీత్‌ ఎనలైజర్‌లో సాంకేతిక లోపాలని ఆరోపిస్తే ఒకటికి రెండుసార్లు వారితో బ్రీత్‌ ఎనలైజర్‌ వద్ద గాలి ఉదమంటున్నారు. సరిగ్గా ఇక్కడే మందుబాబులు చాకచాక్యన్ని ప్రదర్శిస్తున్నారు. బ్రీత్‌ ఎనలైజర్‌ దగ్గరకు రాగానే చిన్నగా ఉదుతున్నారు.మరికొంతమంది లోపలికి గాలి పీల్చుకుంటున్నారు. శ్వాస వేగంగా బయటకు రాకుండా చుసుకుంటున్నారు.ఇంకొందరు ఎవరో ఉదిన బ్రీత్‌ ఎనలైజర్‌ మళ్లీ మాకు ఉపయోగిస్తున్నారా..??.. అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా పోలీసులను అత్మరక్షణలోకి పంపించి వెళ్లిపోవాలన్నది వారి ప్రణాళిక ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం వారు గట్టిగా గాలి ఉదేంత వరకూ శ్వాస పరీక్షను నిర్వహిస్తున్నారు. రక్తంలో అల్కహాల్‌ శాతం దాటిన వెంటనే కేసులు నమోదు చేస్తున్నారు.

ప్రమాదాల కట్టడికే డ్రంకేన్‌ డ్రేవ్‌: సైబరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ డాక్టర్‌ గజరావు భూపాల్‌ ఐపీఎస్‌


మద్యం మత్తులో వాహానాలు నడిపి ప్రమాదాలు చేస్తున్న వారిని కట్టడి చేసేందుకు డ్రంకెన్‌ డ్రైవ్‌పై దృష్టి కేంద్రీకరించాం. కొన్ని ప్రాంతాల్లో పగలు కూడా నిర్వహిస్తున్నారు. వారాంతాల్లో వందల సంఖ్యలో యువకులు మద్యంమత్తులో వాహానాలు నడుపుతున్నట్లు గుర్తించాం.సైబరాబాద్‌ పరిధి ఫైనాన్షియల్‌డిస్టిక్‌,మల్కంచేరువు,సన్‌సిటి,కుకట్‌పల్లి,మీయాపూర్‌,బండ్లగూడ జాగీర్‌,రాజేంద్రనగర్‌,కేబుల్‌బ్రిడ్జ్‌,మాధపుర్‌ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాం. పట్టుబడిన వారి వాహానాలు స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులు తల్లిదండ్రులతో పాటు కౌన్సిలింగ్‌కు వచ్చాకే వదిలేస్తున్నాం. డ్రంకేన్‌డ్రైవ్‌ కేసులో పట్టుబడి జైలుకెళితే భవిష్యత్తులో వారిక పాస్‌పోర్టు వీసా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే సందర్భాల్లో ఈ కేసులు ప్రభావం చూపించనున్నాయి.


మాధాపూర్‌ డివిజన్‌ ట్రాఫిక్‌ ఏసీపీ కే.చంద్రశేఖర్‌రెడ్డి….!!


రహాదారుల్లో రాత్రిళ్లు జరుగుతున్న ప్రమాదాల్లో అధిక శాతం మద్యం మత్తులో ఉన్న వాహనదారుల వల్లే జరుగుతున్నాయి.రోడ్డుపై చోటుచేసుకుంటున్న ప్రమాదాలు మరణాలపై గతంలో సుప్రీంకోర్టు అగ్రహాం వ్యక్తంచేయడంతో పాటుఉల్లంఘనులను కఠినంగా శిక్షించాలంటు అదేశాలు జారీ చేసింది.నిబంధనలు ఉల్లంఘించిన వారు శిక్షల నుంచు తప్పించుకునేందుకు ప్రయత్నించకుండా బ్రీత్‌ఎనలైజర్‌ ఉపయోగిస్తున్నారు.మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ తరుచూ పట్టుబడితే వారిని సమాచారంతో జైలుకు పంపించడం.మాధపూర్‌ ట్రాఫిక్‌డివిజన్‌ పరిధిలోని అన్ని రహాదారులపై నిత్యం తనిఖీలు నిర్వహిస్తు ట్రాఫీక్‌ క్రమబద్దీకరిస్తు, మందుబాబుల ఆటలు కట్టడిచేస్తున్నామని పేర్కోన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News